తిరుమల, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు తమకు తోచినంత కానుకలను అందజేస్తుంటారు. ఓ భక్తుడు స్వామి వారికి శుక్రవారం భారీ విరాళం అందజేశారు. గోయాంక అనే దాత శ్రీవారికి ₹10 కోట్ల విలువ చేసే ఆభరణాలను సమర్పించారు. శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాలను స్వామికి విరాళంగా ఇచ్చారు. ఆలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గోయాంక ఈ విరాళాన్ని అందజేశారు.
అలాగే నిన్న ఓ ఎన్ఆర్ఐ భక్తుడు కూడా వెంకన్నకు భారీ విరాళం సమర్పించారు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఆనంద్ మోహన్ భాగవతుల టీటీడీ ట్రస్టుకు కోటి 40 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, ఎస్వీ విద్యా దాన ట్రస్ట్, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌లకు ఈ మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి విరాళాల చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎన్ఆర్ఐ ఆనంద్ మోహన్ భాగవతులను టీటీడీ చైర్మన్ అభినందించారు.