Police | పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు

Police | పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు
Police |బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రక్రియను ఏసీపీ రవికుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, దేవయ్యలు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా, సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
