మాజీ ఎమ్మెల్యే సక్కు కృషితో నీటి సమస్యకు పరిష్కారం

జైనూర్, ఆంధ్రప్రభ ; అసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కృషితో పవర్ గూడలో నూతన బోర్వెల్ మంజూరు చేశారని పవర్ గూడ సర్పంచ్ తొడసం రాజేందర్ అన్నారు. పవర్ గూడకు నూతన బోర్వెల్ మంజూరు కావడంతో గురువారం బోరు వేయడానికి సర్పంచ్ భూమి పూజ చేసి బోర్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వపరంగా తన వంతు కృషి చేసి నూతన బోర్వెల్ మంజూరు చేసినందుకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కారోబార్ ఉయిక జ్ఞానేశ్వర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
