Current shock | చేనులో అగ్నిప్రమాదం…

Current shock | చేనులో అగ్నిప్రమాదం…
- మంటల్లో చిక్కుకుని రైతు మృతి..
- అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాత….
Current shock | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : పంట నష్టాలు, అప్పుల భారం, కరెంట్ షాక్‌లు, అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు పొలంలోనే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. విద్యుత్ తీగలు తగలడం, విష సర్పాల కాటు, ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్యలు, తీవ్ర ఎండల వల్ల గుండెపోటు వంటి కారణాలు అన్నదాతల మరణాలకు దారితీస్తున్నాయి. కానీ బంగారు చిన్న శేఖర్ రెడ్డి తన సొంత వ్యవసాయ భూమిలో మృతి చెందుతాడని చాలా బాధాకర విషయం.
నంద్యాల జిల్లా, జూపాడు బంగ్లా మండలంలో జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నందికొట్కూర్ జూపాడుబంగ్లా పొలిమేర ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. నందికొట్కూరు పట్టణంలోని కోట వీధికి చెందిన బంగారు చిన్న శేఖర్ రెడ్డి తన సొంత వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు.

బుధవారం తన పొలంలో పెరిగిన కంప చెట్లను తొలగించేందుకు చేనుకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆయన బయటపడలేక మంటల్లోనే చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఎవరైనా కావాలని నిప్పంటించారా అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్సై నరేంద్ర స్థానిక పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
