AP | మండలి వెంకటకృష్ణారావుకు నివాళులు..

AP | మండలి వెంకటకృష్ణారావుకు నివాళులు..

AP | కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన సెంటర్లో నిర్విరామంగా కొనసాగుతున్న మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలలో భాగంగా బుధవారం కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత ముఖ్య అతిథిగా పాల్గొని మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దివిసీమ ప్రాంతంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన గొప్ప ప్రజా నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని తొలిసారిగా ఢిల్లీ నుంచి నాయకులను మన ప్రాంతానికి తీసుకువచ్చి ఏకైక నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని అన్నారు.

AP

తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేయడానికి మొట్టమొదట ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని, దివిసీమ ఉప్పెన సమయంలో దాతలను, స్వచ్ఛంద సంస్థలను, పలు కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి గ్రామ గ్రామానికి తిరిగి ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ఆదుకున్నరు అని కోడూరు, ఉల్లిపాలెం, పాలకాయతిప్ప అఔట్ ఫాల్స్ స్లూయిస్ వారి ఆధ్వర్యంలోని నిర్మాణాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో నాగాయలంక మండలం జనసేన పార్టీ నాయకులు బండ్రెడ్డి హరి, పిఎసిఎస్ చైర్మన్లు, కోడూరు మండలం జనసేన, తెలుగుదేశం పార్టీలా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply