Ap Assembly | ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

Ap Assembly | ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
Ap Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోంది. సూపర్-6, ఇతర సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు.
సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే పది సూత్రాల లక్ష్యమని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు, పరిణామాలను చవిచూసిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందన్నారు.
ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగు నీటి పారుదల రంగాలు తీవ్ర తిరోగమనం చవిచూశాయి. గత చేదు అనుభవాలతో విసిగి వేశారిన ప్రజలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేశాం. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి పది సూత్రాలు రూపొందించాం. సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. స్వర్ణాంధ్ర విజన్ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించింది’’ అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
