Taiwan Open | తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం

Taiwan Open | తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం

Taiwan Open | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో భారత మహిళల రిలే జట్టు సత్తా చాటింది. న్యూ తైపీ సిటీ అథ్లెటిక్స్‌ ఓపెన్‌లో మహిళల 4×100 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. బాంకియావో స్టేడియంలో జరిగిన ఈ పోటీలో శ్రాబణి నంద, ఎస్‌.ఎస్‌. స్నేహ, సుదేష్ణ శివంకర్‌, తమన్నాలతో కూడిన భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. భారత రిలే జట్టు 44.07 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో భారత మహిళల జట్టు తమ పాత ఛాంపియన్‌షిప్‌ రికార్డును సమం చేసింది. ప్రత్యర్థి జట్లను వెనక్కి నెట్టుతూ భారత అథ్లెట్లు సమన్వయంతో రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. తైవాన్ ఓపెన్‌లో భారత మహిళల రిలే జట్టు సాధించిన ఈ విజయం భారత అథ్లెటిక్స్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతర్జాతీయ వేదికపై భారత క్రీడాకారిణులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.

Leave a Reply