khanapur l 12 కాంగ్రెస్ అభ్యర్థులను 12 వార్డుల నుంచి గెలిపించాలి..

khanapur l 12 కాంగ్రెస్ అభ్యర్థులను 12 వార్డుల నుంచి గెలిపించాలి..

25 కోట్ల విధులను ఖానాపూర్ మున్సిపాలిటీకి అభివృద్ధికి తెచ్చాను
ఖానాపూర్ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

khanapur l ఖానాపూర్ , ఆంధ్రప్రభ: ఖానాపూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా పట్టణంలోని జగన్ చౌక్ లో బహిరంగ సభను నిర్వహించి సముద్రాల వేణుగోపాల చారి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రజలతో మాట్లాడారు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తెచ్చిన 25 కోట్ల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి ఈ పట్టణాన్ని అద్దంలో తీర్చిదిద్దుతానని అన్నారు గతంలో ఉన్న పాలక అధికారులు రోడ్డు వైండింగ్ను మొదలుపెట్టి వదిలేశారు ఎవరి వల్ల అయితే రోడ్డు వెండింగ్ ఆగి ఉండెను వాళ్ళ వద్దకు వెళ్లి వాళ్ళ కాళ్లు మొక్కి వాళ్లను భుజగించి వాళ్లు ఆపుకున్న ఇండ్లను కూలగొట్టి ఈరోజు రోడ్డు వెడల్పుకు అడ్డంకంగా ఉన్న సమస్యను తొలగించాను నేను జంగుబాయి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పేదే చేస్తాను చేసేదే చెప్తాను.

రానున్న గత కొన్నాళ్లుగా మునిసిపాలిటీ లో ఉన్న 12 వార్డులలో మార్నింగ్ చేసి అక్కడ నెలకొన్న సమస్యలను కళ్లారా చూసి ప్రజలకు కావాల్సిన ప్రజలు ఇబ్బంది పడుతున్న అన్ని విషయాలను కనుక్కొని ఈరోజు 25 కోట్ల నిధులను ఖానాపూర్ మున్సిపాలిటీకి మంజూరు చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కొరకే గతంలో ఇంద్ర నగర్ కాలనీ ఇందిరమ్మ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిందే రాజీవ్ నగర్ కాలనీ కాంగ్రెస్ ఇచ్చిందే గాంధీనగర్ కాంగ్రెస్ ఇచ్చిందే అంబేద్కర్ నగర్ కాంగ్రెస్ ఇచ్చిందే టు బిహెచ్కె స్థలాన్ని కాంగ్రెస్ సేకరించింది కాంగ్రెస్కు ఇచ్చుడే తెలుసు కానీ మాయ మాటలు చెప్పుడు రాదు అని ఎమ్మెల్యే వేడమ బొజ్జు ప్రజలతో చెప్పారు.

బిజెపి బీఆర్ఎస్ కలిసి ఖానాపూర్ నుండి ప్రయత్నం చేస్తున్నారని వ్యూహం రచించి ఒకటో వార్డులో బిజెపి టీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది మూడవ వార్డులో బిజెపి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది ఐదవ వార్డులో బిజెపి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది ఆరవ వార్డులో బిజెపి టీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది ఏడవ వార్డులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది 9వ వార్డులో బిజెపి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది 11 వ వార్డులో బిజెపి బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది.

ఖానాపూర్ ను దోచుకోవటానికి వాళ్ళిద్దరూ కలిసిపోయారు ప్రజలు ఇది గమనించి ఓటును వినియోగించుకోవాలని పట్టణ ప్రజలతో ఓటర్లతో విజ్ఞప్తి చేశారు దేశం కోసం ధర్మం కోసం అని పెద్దపెద్ద మాటలు మాట్లాడాలని తప్ప చేసేది వాళ్ళు ఏమి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదవ వార్డ్ నుంచి దేశ సరిహద్దులలో దేశ రక్షణ కొరకు తుపాకీ లేపిన అభ్యర్థిని టికెట్ ఇచ్చిందన్నారు ఆరవ వార్డులో అమరుల్లాఖాన్ను రాజకీయ అనుభవం ప్రజలతో ఉండి రెండుసార్ల రాజకీయంలో గెలుపొంది ప్రజలను సేవ చేసిండు రానున్న రోజుల్లో ఆ వార్డుకు కావలసిన నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను పట్టణంలో ఉన్న 12 వార్డులలో కోటిన్నర కోటిన్నర లక్షలు కేటాయించి ఉన్నాయని ఎన్నికల కోడ్ ముగిసిన తక్షణమే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని ఆదివాసుల ఆరాధ్య దైవమైన జంగుబాయి పై ప్రమాణం చేసి ఆయన చెప్పారు.