జనం జనం ప్రభంజనంలా పుప్పాల ప్రచారం

జనం జనం ప్రభంజనంలా పుప్పాల ప్రచారం

భారీగా పెరుగుతున్న ప్రజల మద్దతు
పుప్పాల తరుపున జోరుగా ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

మంథని: జనం జనం ప్రభంజనంలా పుప్పాల తిరుపతి ప్రచారం కొనసాగుతుంది. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అయన తరపున విశేషంగా ప్రచారం చేశారు. మంథని మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు తరఫున బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పుప్పాల తిరుపతి ప్రచారంలో రాకెట్ లా దూసుకవెళ్తున్నారు. మోసపోవద్దు, గోసపడతాం అనే నిదానంతో ప్రతి గడపగడపకు అయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గతంలో ప్రజాసేవ చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈసారి ఖచ్చితంగా మంథని మున్సిపల్ పోరులో పుప్పాల తిరుపతి విజయం పక్కా అని వార్డు ప్రజలే ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. గెలిచిన తర్వాత పాలకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా పరిపాలనందించడంలో ముందు ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను సానుకూలంగా వింటూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆయన ప్రచారానికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సహకారంతో మంథని పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటెయ్యాలని ఆయన కోరారు. కారు గుర్తు ఓటు వేస్తే కష్టం రాకుండా పరిపాల అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. వార్డు ప్రజలలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడంలో ప్రత్యేక కార్యచరణ చేపడతానని ఆయన తెలిపారు.