9వ వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా – కాంగ్రెస్ అభ్యర్థి బీసు శ్రీకాంత్ గౌడ్..

9వ వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా – కాంగ్రెస్ అభ్యర్థి బీసు శ్రీకాంత్ గౌడ్..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల సహకారంతో.. 9వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని.. తనను ఒక్కసారి కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి బీసు శ్రీకాంత్ గౌడ్ సోమవారం ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

తనని కౌన్సిలర్ గా గెలిపిస్తే.. జామ చెట్ల బావి, కొండాపురం, మంగళగడ్డ, గడి బజార్లలో కాలికి మట్టి అంటకుండా.. పూర్తి స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం, మౌలిక సదుపాయాలు అన్నిటిని కల్పించి ఆదర్శవాడిగా తీర్చిదిద్దామని హామీ ఇస్తున్నారు. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply