AP | ఉయ్యూరు వీరమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

AP | ఉయ్యూరు వీరమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు..
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా పోలీసులు.
AP | ఉయ్యురు, ఆంధ్రప్రభ : చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో చివరి ఆదివారం అయిన ఈరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం మొక్కుబడులు చెల్లించుకోవడం కోసం పోటెత్తారు, ఒక అంచనా ప్రకారం భక్తుల సంఖ్య 60 వేల నుండి 80 వేల వరకు రావడం జరిగింది.
ఆలయం పాత నిర్మాణం అవ్వటం ప్రవేశ ద్వారాలు ఇరుగ్గా ఉండటంతో దర్శనాలకు చాలా సమయం తీసుకుంది, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి పోలీసులు విశ్వతంగా చర్యలు చేపట్టారు, కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ ఐపీఎస్ గారు పరిస్థితిని గమనించి బందోబస్తులో ఉన్న 400 మంది సిబ్బందికి అదనంగా మరొక 100 స్పెషల్ పార్టీ వారిని అప్పటికప్పుడు పంపించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడం జరిగింది.
అసంఖ్యాకంగా భక్తులు విచ్చేసినప్పటికీ ఎటువంటి తోపులాటకు కానీ, అవాంఛనీయ సంఘటనలకు గాని ఆస్కారం లేకుండా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును నిర్వహించి భక్తులు దర్శనాల నిర్వహించుకునేలా చర్యలు చేపట్టారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ భక్తులకు దిశా నిర్దేశం చేశారు.
అనునిత్యం సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ నిరంతర డ్రోన్ కెమెరాలు సర్వేలెన్సు ద్వారా పరిశీలిస్తూ ఆకతాయిల ఆగడాలకు అవకాశం లేకుండా చూశారు.
గన్నవరం డిఎస్పి శ్రీ చలసాని శ్రీనివాస్ గారు స్వయంగా క్యూలైన్ల లో ఉండి సిబ్బందిని సమన్వయం చేస్తున్నారు, కంకిపాడు హనుమాన్ జంక్షన్ పెనమలూరు గన్నవరం ఉయ్యూరు టౌన్ సిఐలు, 25 మంది ఎస్ఐలు 400 మందికి పైగా సిబ్బంది బందోబస్తు లో పాలుపంచుకుంటున్నారు, భక్తుల రద్దీ ఈ అర్ధరాత్రి దాటే వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
