కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి…

కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి…

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం…

పాల్వంచ 8 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టండి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణ ప్రాంతం 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరిగే సుజాత అన్నారు. ఆదివారం 37వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్షని డివిజన్ అభివృద్ధి విషయంలో తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఓటర్లకు తమ గుర్తు హస్తం గుర్తు అని వివరిస్తూ ప్రచారం జోరును పెంచారు. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆశీర్వదించి గెలిపించి కార్పొరేటర్ గా తీర్చిదిద్దాలని కోరారు. సంక్షేమ పథకాలతో పాటు డివిజన్లో మరిన్ని అభివృద్ధి పనులు చేయటానికి ప్రత్యేక ప్రణాళికతో ఉన్నానన్నారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే సాధ్యపడుతుందన్నారు. ఆదరించి గెలిపించండి ఆడబిడ్డగా సేవలందిస్తానన్నారు. ఆమెతోపాటు బూర్గంపాడు మండలంలోని లక్ష్యం పురం గ్రామపంచాయతీ సర్పంచ్ బాదం వెంకటేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిరెడ్డి కోటిరెడ్డి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply