Mudhol l ముధోల్ లో పదహారెండ్లుగా అఖండ హరినామ సప్త..

Mudhol l ముధోల్ లో పదహారెండ్లుగా అఖండ హరినామ సప్త..
Mudhol l ముధోల్, ఆంధ్రప్రభ: ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో ఆ గ్రామస్తుల ఐక్యమత్యమే గత పదహారు సంవత్సరాల కాలంగా శ్రీ పశుపతినాథ్ ఆలయప్రాంగణంలో చేపడుతున్న అఖండ హరినామ సప్త విడిసి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు విడిసి అధ్యక్షులు వరగంటి విఠల్ తెలిపారు. గ్రామంలో సోమవారం ఫిబ్రవరి 9 వ తేదీన అఖండ హరినామ సప్త ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఎనిమిది రోజులపాటు జరిగే అఖండ హరినామ సప్తకు బాలాజీ గురూజీ బండార్కర్, రాందాస్ గురూజీ వాయికర్, దిగంబర్ గురూజీ కల్దుర్కి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 12 గంటలకు వరకు భజన కీర్తనలు, పారాయణం, భజనలు జరుగుతాయని గ్రామస్థులు తెలిపారు.
14,15,16 వ తేదీలలో శివరాత్రిని పురస్కరించుకొని జాతర ఉంటుందని, 15 వ తేదీన శివ కల్యాణం, అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు,16 వ తేదీన ముగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు మహా అన్నదానంలో పాల్గొనాలని పెద్దలు కోరారు. గ్రామంలోని గ్రామ పెద్దలు యువకులు మహిళలు చిన్నారులు ఈ అఖండ హరినామ సప్తకు పదహారు సంవత్సరాలుగా ఐక్యమత్యంగా విజయవంతం కావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సప్త మూలంగా గ్రామ ప్రజలు భక్తి మార్గంలో నడుచుకోవడానికి ఎంతో కృషి జరుగుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విడిసి ఉపాధ్యక్షులు పల్లెల నాగేష్, కోశాధికారి జిందం వెంకటేష్, కార్యదర్శి అగాలం దశరథ్, ముధోల్ తాలుకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేష్,విడిసి సభ్యులు, భజన భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
