9 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంగాల కళ్యాణి మల్లారెడ్డి

9 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంగాల కళ్యాణి మల్లారెడ్డి
ప్రజా సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ
9వ వార్డులో అభివృద్ధికి కృషి చేస్తా
కాంగ్రెస్ అభ్యర్థి వంగాల కళ్యాణి మల్లారెడ్డి
జనగామ, ఫిబ్రవరి 8 ( ఆంధ్రప్రభ ) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని,9వ వార్డులో అభివృద్ధికి కృషి చేస్తా అని కాంగ్రెస్ అభ్యర్థి వంగాల కళ్యాణి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం 9వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా వివిధ వార్డుల్లో కౌన్సిలర్ గా ప్రజా సమస్యలపై గలమెత్తుతూ పరిష్కారం కోసం కృషి చేసిన అనుభవం ఉందని, ఈ నేపథ్యంలో 9వ వార్డు అభ్యర్థిగా విజయం సాధించి అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగుతుందని అధికారం చేపట్టిన వెంటనే వివిధ పథకాలను అమలుపరిచారని ఆమె తెలిపారు.రైతు లకు రెండు లక్షల రుణమాఫీ,
ఉచిత విద్యుత్ 200 యూనిట్లు,మహిళకు ఉచిత బస్సు ప్రయాణం,గ్యాస్ సబ్సిడీ,రైతు భరోసా, బి సి కమీషన్ ఏర్పాటు,కులగణన,
రైతు కమీషన్ ,విద్యా కమీషన్ ఏర్పాటు,సన్న వడ్లకు 500 బోనస్, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందని వారు తెలిపారు. 10 ఏళ్ల గులాబీల పాలనలో రాష్ట్రం అప్పుల మయంగా మారిందని, అభివృద్ధి మటుమాయం అయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గత పాలకులు చేసిన అప్పులు కడుతూనే ప్రజా సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించిందని అన్నారు. విద్యా ,వైద్య రంగాలతో పాటు ఉపాధి అవకాశాల్లో తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధుల
ద్వారా అభివృద్ధి చెందేల కృషి చేసిందని అన్నారు. రెండు సంవత్సరాల కాలంలో జనగాం మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్దే అని వారు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని, అభివృద్ధి కోసం ప్రభుత్వ నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని వారు. తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
