snake bite l పాముకాటుతో ఎద్దు మృతి

snake bite l పాముకాటుతో ఎద్దు మృతి

పాముకాటుతో మృతి చెందిన ఎద్దు
90 వేల విలువ ఎద్దును కోల్పోయిన రైతు

జైనూర్, ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడమామడ గ్రామంలో ఆంద్ ఆదివాసి రైతు కరాడే విట్టల్ కు చెందిన ఎద్దు పాము కాటుకు గురై మృతి చెందింది. పాము కాటు వల్ల రూ. 90,000 విలువ చేసే ఎద్దును ఆ రైతు కోల్పోయాడని సర్పంచ్ కుమ్ర యశోద కేశవ్ రావు, ఉపసర్పంచ్ శివాజీ పేర్కొన్నారు. ముందే పంటలు సరిగా పండగ అప్పులు తీరక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పాముకాటు వల్ల ఎద్దును కోల్పోయి కరాడే విట్టల్ గిరిజన రైతు నష్టపోయడని వారు తెలిపారు. ఆ రైతుకు ఐటిడిఎ ద్వారా సాహయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కుమ్ర యశోద కేశవ్, ఉప సర్పంచ్ శివాజీ అధికారులకు కోరారు.

Leave a Reply