ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా..
ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా..
- 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎండి సోఫీ
కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు తనను కౌన్సిలర్ గా గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ సోపి పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
అభివృద్దే ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను మీ బిడ్డగా ఆశీర్వదించాలని మహమ్మద్ సోఫీ ఓటర్లను కోరుతున్నారు. అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి బాటిల్ వేయాలని ఆయన పేర్కొన్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో భారీగా నిధులు తీసుకువచ్చి వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని మహమ్మద్ సోఫీ ఓటర్లను కోరారు.
