బీజేపీ దేశ రక్షణ సమగ్రత కోసం ప్రత్యేక కృషి..

బీజేపీ దేశ రక్షణ సమగ్రత కోసం ప్రత్యేక కృషి..

  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; బిజెపి దేశ సమగ్రత బావి తరాల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో నిర్వహిస్తున్న ప్రశిక్షణ మహా అభియాన్ 2026కార్యక్రమం జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, ప్రశిక్షణ ఇన్చార్జి జి. రమేష్ సర్పంచ్ రేణుక భరత్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాల కోసం దేశ హితం కోసం కృషి చేస్తుందని భారతదేశ అస్తిత్వాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరిని సంఘటితం చేస్తుందని దేశ ధర్మరక్షణ కోసం పాటుపడడంతోపాటు రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. మోడీ హయాంలో ఆయుధ శక్తిని పెంచడంతోపాటు 12 ఏళ్ల పాలనలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా కృషి చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతుందన్నారు. బీజేపీ చరిత్ర, సైద్ధాంతిక భూమిక, కార్యవిస్తరణ, బూత్ స్థాయి కార్యక్రమాలు, సోషల్ మీడియా, ఏఐ, నమో యాప్, సరళ్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి అంత్యోదయ లక్ష్య సాధనలో కార్యకర్తలు ముందుండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర నాయకులు భాస్కర్, విజయ్ కుమార్, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, సర్పంచులు అంజయ్య, తిరుమలేష్, నర్సిములు, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యురాలు కొక్కూరుపా లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శిలు తారాకృష్ణ, రణవీర్, నాయకులు కార్యకర్తలు వెంకటయ్య, గోపాల్, హన్మంతు, రఘువీర్, ఆంజనేయులు గౌడ్ విజయన్ గౌడ్, మల్ రెడ్డి, రోసినప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply