మసీదు వద్ద కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్ ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ : మేరె బాయ్ లోగో మేరేలియె ఓట్ కె సాథ్ కామ్యాబికి దువ కరె అంటూ మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోళ్ల సంధ్య వెంకటేష్ మక్తల్ పట్టణంలోని షరీఫా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు .శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఆమె మైనారిటీ సోదరులను కలుసుకొని ఓటు వేయమని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ నుండి 15వ వార్డు కౌన్సిలర్ గా బరిలో ఉన్న తనను ఆశీర్వదించి అండగా ఉండి అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి మున్సిపల్ కౌన్సిలర్ గా తనను గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు .
స్థానికంగానూ తమ కుటుంబం మైనార్టీలతో కలిసి జీవనం కొనసాగిస్తుందని మీ కుటుంబ సభ్యురాలుగా తనను భావించి ఎన్నికల్లో తనను ఆదరించాలని కోరారు. ఎంపీటీసీగా ఎంపీపీగా మీ అందరి సహకారంతో మక్తల్ అభివృద్ధికి మా కుటుంబం కృషి చేసింది మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లోను మునిసిపల్ కౌన్సిలర్ గా బరిలో ఉన్న తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో 15వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. అందుకు మీ అందరి సహకారం కావాలని అభ్యర్థించారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి మున్సిపాలిటీకి పంపించాల్సిందిగా కోళ్ళ సంధ్య వెంకటేష్ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాలంబిన్ ఉమర్ బస్రవి ,మేదరి శ్రీనివాసులు, సిఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
