సేవలు గుర్తించి మరోసారి ఓటు ఇవ్వండి
సేవలు గుర్తించి మరోసారి ఓటు ఇవ్వండి
- మాజీ కేంద్ర మంత్రి వేణు గోపాలచారి
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ ; ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 31 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాజీ శ్రీనివాసును గతంలో చేసిన సేవలు చూసి మరోసారి అవకాశం ఇవ్వాలని మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కె. శ్రీహరి రావు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అప్పల కావ్య లు శుక్రవారం ఇంద్ర నగర్ లో ఇంటింట ప్రచారాన్ని చేపట్టి ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున నిర్మల్ మున్సిపాలిటీ. మీ వార్డు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీతోనే సాధ్యమైతన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని అభివృద్ధి జరగాలంటే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
