వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రేమ్ చందు

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం లక్షెటిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చందు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించుకోవడం వల్ల నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, స్థానిక సర్పంచ్ అజ్మీరా రాజేశ్వర్ నాయక్,ఉపసర్పంచ్ సిరికొండ నవీన్, మాజీ ఎంపిటిసి ముత్యాల శ్రీనివాస్,ఆర్ జి పీ ఆర్ ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మార్కెట్ డైరెక్టర్ బండ రాకేష్,జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అల్లంల అనిత, ఐకెపి ఎపియం తోట లక్ష్మీ, వార్డు సభ్యుడు, కట్కూరి రాజన్న,నాయకులు, బోయిడి వెంగాల్ రావు,గాండ్ల నరేష్,గుర్రాల రమేష్, సులువ సురేష్, సీసీ తిరుపతి గౌడ్,ఐకేపీ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply