POLICE | నలుగురు ఏజెంట్లు అరెస్ట్

POLICE | నలుగురు ఏజెంట్లు అరెస్ట్

POLICE | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా అభంశుభం తెలియని చిన్నారులను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి… గుజరాత్‌ లో పుట్టిన శిశువులను విమానాలు, రైళ్లలో ఓ గ్యాంగ్ గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌‌ కు తరలిస్తోంది. గత రెండేళ్లుగా ఈ దందాను నిరాటంకంగా కొనసాగిస్తోంది. అయితే అహ్మదాబాద్ పోలీసులు ఓ మిస్సింగ్ కేసు విషయమై రంగంలోకి దిగడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.

తాజాగా నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేయగా.. హైదరాబాద్‌లో వారికి సహకరిస్తున్న ఏజెంట్లు, మధ్యవర్తులపై నిఘా పెంచారు. ఇందులో ప్రధాన సూత్రధారుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. గత రెండేళ్లలో ఇప్పటి వరకు 25మంది శిశువులను విక్రయించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.