6thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా. ఏఐ శక్తివంతం అడుగులు.. ఉద్యోగాలకు ప్రతికూలం భవిష్యత్తా..?

6thFebCartoon | ఏఐ విప్లవం : ఉద్యోగ ప్రపంచాన్ని వణికిస్తున్న శక్తివంతం కృత్రిమ మేధ

6thFebCartoon | ఆంథ్రోపిక్స్ ఏఐపై టెక్ ఉద్యోగుల్లో ఆందోళన
ఉద్యోగాలపై ప్రతికూలం ప్రభావం చూపుతున్న కొత్త ఏఐ టూల్స్
కార్టూన్‌లో భవిష్యత్తు ప్రతిబింబం – ఔరా ప్రత్యేకం

6thFebCartoon
6thFebCartoon


6thFebCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంథ్రోపిక్స్…ఇప్పుడు టెక్ కంపెనీల ఉద్యోగుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న పేరు. ఇదొక స్టార్టప్ కంపెనీ. అంతగా భయపెట్టేందుకు ఈ స్టార్టప్ కంపెనీలో ఏముందని అనుకోకండి. ఆ కంపెనీ చేసిన ప్రకటన వింటే మీరూ ఆశ్చర్యపోతారు…ఆ తర్వాత భవిష్యత్తు తల్చుకుని ఒకింత భయంతో వణికి పోతారు. అదేమిటో తెలుసా?

ఇప్పుడు అందుబాటులో ఉన్న చాట్ జీపీటీ, గ్రోక్ తదితర ఏఐ టూల్స్ మనం ఇచ్చిన ఆదేసాల మేరకు సమాచారాలు, పరిష్కారాలూ అందిస్తాయి. కానీ ఈ ఆంథ్రోపిక్స్ కంపెనీ రూపొందిస్తున్న ఏఐ టూల్ మాత్రం, మన ఆదేశాలతో పనిలేకుండానే, మన పనులన్నీ చక్కబెట్టేస్తుందట…మనం చెప్పకుండా మన పనులన్నీ చేసిపెట్టేస్తే మంచిదేగా? భయపడడం ఎందుకంటారా? భయం కాక మరి ఇంకేంటి? ఇప్పటికే ఏఐ దెబ్బకు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగులకు ఉవాసన పలికి ఆ స్థానాలను ఏఐ తో భర్తీ చేస్తున్నారు.

ఇక ఇలాంటి కృతిమ మేధ మార్కెట్లోకి వస్తే ఉద్యోగుల అవసరం కంపెనీలకు ఉంటుందంటారా? ఏ సాఫ్ట్ వేర్ కంపెనీ చూసినా పూర్తిగా యంత్రాలూ, వాటితో పనిచేయించే యంత్రాలే దర్శనమిస్తాయి. మరి అప్పటిదాకా చదువుకున్న పెద్ద పెద్ద చదువులూ, సంపాదించుకున్న అనుభవం ఏమైపోవాలి? రోడ్డున పడే అనుభవజ్ఞులంతా ఏమైపోవాలి? వారి మీద ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? విస్తరిస్తున్న కృతిమ మేధ చూపిస్తున్న పరిష్కారాల కంటే రేకెత్తిస్తున్న ప్రశ్నలే అధికం.

ఇకపై ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఉండబోవని ఇప్పటికే టెక్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. దానికి తోడు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరాలనూ ఈ కొత్త ఏఐ టూల్ భర్తీ చేసేస్తే భవిష్యత్తు ఏమిటి? అని టెక్ ఉద్యోగులంతా భయపడుతున్నారు.

ఈ పరిస్థితిని ఒక్క బొమ్మలో చూపించిన ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ కార్టూన్ ఇది. ఒక్క ఏఐ విశ్వమంతా వ్యాపించి, అనేకమంది ఉద్యోగులపై పాదం మోపుతున్న బొమ్మలో భవిష్యత్తు కళ్ళకు కట్టిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తున్న కార్టూన్ ఫీచర్ ఔరా.

Leave a Reply