5thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

5thFebCartoon |తగ్గినట్టే తగ్గి పెరిగిన బంగారం ధరలు.. మధ్యతరగతికి షాక్
5thFebCartoon | ఊరటనిచ్చినట్టే ఇచ్చి మళ్లీ ఎగిసిన బంగారం ధరలు
సామాన్యుల కలగా మారుతున్న బంగారం కొనుగోలు
వారం కూడా నిలవని ధరల తగ్గింపు
బంగారం ధరలపై ఆంధ్రప్రభ కార్టూన్ విశ్లేషణ

5thFebCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకటి రెండు రోజులు తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు సామాన్యులకు ఊరట నిచ్చాయి. కాస్తో కూస్తో బంగారం కొనొచ్చని ఆశపడిన సామాన్యుల ఆశలపై నీళ్ళు చల్లినట్టుగా మళ్ళీ ఊపందుకుంటున్నాయి. మళ్ళీ పెరిగే లోపు బంగారం కొనేందుకు కావాల్సిన డబ్బు సమకూర్చుకునే లోపుననే ఇలా పెరగడం సామాన్యుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. అంటే ఎప్పుడు బంగారం ధరలు తగ్గినా నమ్మొద్దని ఈ పరిణామాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ తగ్గింపులు కనీసం వారం పాటు కూడా నిలకడగా ఉండట్లేదు. అందినట్టే అంది అంతలోనే అందలమెక్కుతున్న బంగారం పై సామాన్యులు పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనా అని అనుకుంటున్నారు మధ్యతరగతి వారు.
ఈ పరినామాన్ని ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ సింపుల్ గా చూపించిన కార్టూన్ ఇది గత రెండు దశాబ్దలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.
