CM Revanth Reddy | రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చింది
CM Revanth Reddy | రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చింది
CM Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చొప్పదండిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓట్లు, సీట్లు బీజేపీకి దానం చేశారన్నారు. కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ఏటీఎంగా మార్చుకుందని బీజేపీ ఆరోపించిందన్నారు.
ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే.. బీఆర్ఎస్ నేతలను బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసు అప్పగించి ఆరునెలలు గడుస్తున్నా… అతీ.. గతీ లేదన్నారు. దీని వెనుక ఉన్న మాయ, మర్మం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను కాపాడుతోంది బీజేపీనేనన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బంధం నిజం కాకపోతే.. మున్సిపల్ ఎన్నికల్లోపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయాలన్నారు.
