Wyra | సీల్డ్ కవర్ లోనే…వైరా మున్సిపల్ చైర్ పర్సన్ పేరు..

Wyra | సీల్డ్ కవర్ లోనే…వైరా మున్సిపల్ చైర్ పర్సన్ పేరు..

Wyra | వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్కు సంబంధించి చిక్కుముడి వీడటం లేదు.. చైర్ పర్సన్ ఎంపిక షీల్డ్ కవర్ లోనే ఆ పేరు ఉందనే విషయం స్పష్టమవుతుంది… మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతి చైర్ పర్సన్ ఎంపిక దాదాపు ఖరారు అయిందని… కొన్ని రాజకీయ పరిణామాల దృశ్య పువ్వాళ దుర్గాప్రసాద్ కుటుంబం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విరమించుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి… అయితే చైర్ పర్సన్ పేరును మున్సిపల్ ఎన్నిక అనంతరం అధిష్టానం ప్రకటించే నేపథ్యంలో.. కసరత్తు జరుగుతుంది.. మిగిలిన ఆశావాహులు మార్క్ పేడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సతీమణి మూడో వార్డులో బరిలో ఉన్నారు..

Wyra

అంతేగాక ప్రముఖ వైద్యులు సామాజికవేత్త కాపా మురళీకృష్ణ సతీమణి కాపా చంద్రకళ ఆరో వార్డు నుండి ఆమె కూడా బరిలో ఉన్నారు.. మరొకరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంపుడి రోశయ్య కోడలు రాంపుడి రాజలక్ష్మి 15వ వార్డులో పోటీ లో ఉండటంతో మున్సిపల్ ఎన్నిక చైర్ పర్సన్ గురి గా రసవత్తరంగా మారనుంది… చైర్మన్ పీఠం కోసం ఎవరికివారు ఆయా వార్డుల్లో కుస్తీ పడుతున్నారు.. జనరల్ మహిళ కు. చైర్ పర్సన్ రిజర్వేషన్ కేటాయించడంతో.. 20 వార్డులో పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ విత్డ్రా రోజుతో ఒక్కసారిగా రాజకీయ వేడి చల్లబడింది… చైర్ పర్సన్ ఎంపికకు సంబంధించి అధిష్టానానికి స్పష్టమైన క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది.. సీల్డ్ కవర్లో దాగి ఉన్న పేరును కూడా ఇప్పటికే ఖరారు అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆ పేరునే తప్పక ఖరారు చేస్తారని.. రాజకీయ పరిస్థితులను పరిణామాలను పరిగణలోకి తీసుకొని.. చైర్ పర్సన్ ఎంపిక జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.. సామాజికంగా రాజకీయంగా సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిని చైర్ పర్సన్ కి ఎంపిక చేసినట్లు సమాచారం.. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగా తనదైన పాత్రను పోషిస్తున్న వ్యక్తికి ప్రాధాన్యతనిస్తూ.. ఆ పేరును గోప్యంగా ఉంచినట్లు కూడా విశ్వసనీయ సమాచారం… చైర్ పర్సన్ ఎంపికలో ఆ ముగ్గురిలో సామాజిక అంశాలపై మంచిపట్టున్న నాయకుడి వైపు వైరా మున్సిపాలిటీలో అధిష్టానం జరిగిన సర్వేలో అత్యధిక సంఖ్య ప్రజాభిమానం ప్రజా ఆమోదం ఆ వ్యక్తికే మెజార్టీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఆ సర్వే నివేదిక వెల్లడించిందని చర్చ జరుగుతోంది…

Leave a Reply