ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి
- ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు
గుండాల/ ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ ; గుండాల మండల పరిధిలో ముత్తాపురం గ్రామపంచాయతీలో గల ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని గుండాల మండల ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ వ్యాప్తంగా అన్నిగ్రామాల్లోని ప్రజలు, రైతు వ్యవసాయ కూలీలు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉపాధి పనులకు సకాలంలో రావాలని కోరారు. గ్రామం ఉపాధి హామీ పనులు ముమ్మరంగా నిర్వహిస్తుండడంతో ప్రజలకు, రైతు కూలీలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఉపాధి హామీ పథకంతో వలస కూలీలను నియంత్రించడమే ప్రధాన లక్ష్యం అన్నారు.మండల కేంద్రంతోపాటు అన్నిపంచాయతీ ప్రజలకు ఉపాధి హామీ పథకం ఒక వరమన్నారు. అదే క్రమంలో ముత్తాపురం పంచాయతీలోని కార్యదర్శి బండారి సతీష్ పర్యవేక్షణలో జరుగుతున్న గ్రామీణ ఉపాధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దాని కనుగుణంగా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ఇందిరా మహిళ శక్తి భవన నిర్మాణం ఎలాంటి లోటుపాట్లు లేకుండా త్వరితగతిన ప్రజలకు వినియోగంలో వచ్చేందుకు సంబంధిత గుత్తేదారు కృషి చేయాలన్నారు.
