DEAD | పురుగు మందు తాగి మహిళ మృతి

DEAD | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ పంచాయితీ పరిధిలోని రాసపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పద్మ (46)అనే మహిళ పురుగుల మందు తాగి మంగళవారం మృతి చెందారు. దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్ కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం. మృతురాలు గత 6 సంవత్సరాల నుండి మూత్రపిండాల వ్యాదితో బాధపడుతుండేదని ఆమె భర్త సత్తయ్యతో పలు మార్లు బ్రతకాలి అనిలేదు నేను చనిపోతా అంటుండేదని పిల్లలను బాగాచూసుకొమ్మని చెప్పెదని అన్నారు.
భర్త సత్తయ్య గత నెల 31న చేపలు పట్టడానికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి కింద పడిఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనె లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారాని తెలిపారు. మృతురాలు భర్త ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
