ఉట్నూర్, ఏప్రిల్ 4 (ఆంధ్రప్రభ) : ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ లో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో గిరిజన మహిళ ఇప్పపువ్వుతో తయారు చేస్తున్న లడ్డూ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన విషయం విధితమే. ఇప్పపువ్వు లడ్డూ చేస్తున్న మహిళా కమిటీ అధ్యక్షురాలు కుమ్ర బాగుబాయిని శుక్రవారం భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, తనయుడు రితీష్ రాథోడ్ శాలువాతో సత్కరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలు కమిటీ ఏర్పాటు చేసి ఇంకో లడ్డు తయారు చేయడం ఎంతో సంతోషకరమని, ఈ విషయంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రశంసించడం ఎంతో గర్వకారణమన్నారు. మహిళలు ఇలాగే ముందుకు వచ్చి అన్ని రంగాల్లో ఎదగాలని ఆయన కోరారు. ఇప్పపువ్వు లడ్డుతో రక్తహీనత నిర్మూలనతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, మహిళల అభివృద్ధి ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు . ఈ సన్మాన కార్యక్రమంలో నాయకులు అశోక్ రావు, జన్నారం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మధురావు, గరీబ్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు న్యాయవాది భానోత్ జగన్, స్థానిక సర్పంచ్ హరి నాయక్, నాయకులు తోట సత్తన్న, బింగి.వెంకటేష్ పాల్గొన్నారు.