TG | గెలుపు నల్లేరు మీద నడకే….

TG | గెలుపు నల్లేరు మీద నడకే….
- శ్రీకాంత్ గౌడ్‌కు మాజీ కౌన్సిలర్ శివుడు మద్దతు
- జగ్గన్న ఆధ్వర్యంలో ప్రకటన, కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం
TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి రాంనగర్ రామమందిర్ మాజీ కౌన్సిలర్ శివుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎన్ఎస్‌యూఐ–యూత్ కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ గౌడ్‌కు తన మద్దతును ప్రకటించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శివుడు అధికారికంగా మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… శ్రీకాంత్ గౌడ్ గెలుపు నల్లేరు మీద నడకేనని వ్యాఖ్యానించారు. యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో శ్రీకాంత్ గౌడ్‌కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మాజీ కౌన్సిలర్ శివుడు మద్దతుతో శ్రీకాంత్ గౌడ్ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో కిరణ్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
