అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

మద్దూర్, ఆంధ్రప్రభ:
మద్దూర్ మండలంలో ఒక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం నిడ్జింత గ్రామ శివారులో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడ్జింత గ్రామం నుండి మద్దూర్ వైపు కట్టెలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.