Jogipeta | సొంత పథకాలతో ముందుకొస్తున్న..

Jogipeta | సొంత పథకాలతో ముందుకొస్తున్న..

  • 10వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
  • బీఆర్ఎస్ 10వ వార్డు అభ్యర్థి చౌరిగారి విజయలక్ష్మి

Jogipeta | జోగిపేట, ఆంధ్రప్రభ : మున్సిపల్ పట్టణంలోని 10వ వార్డు ప్రజల సంక్షేమం కోసం సొంత పథకాలతో మీ ముందుకు వస్తున్నానని, 10వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 10వ వార్డు అభ్యర్థి చౌరిగారి విజయలక్ష్మి నర్సింలు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ 10వ వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ప్రజా సంక్షేమంతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తానని, వార్డు ప్రజలు ఇంటి ఆడబిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓర్లను ఆమె అభ్యర్థించారు.