Accident | బైకు ప్రమాదం.. యువకుడు మృతి..

Accident | బైకు ప్రమాదం.. యువకుడు మృతి..

Accident, ఓదెల, ఆంధ్రప్రభ : అదుపు తప్పిన బైకు పొలాల్లోకి దూసుకెళ్లడంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఓదెల మండలం కొలనూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొలనూర్ గ్రామ శివారులోని పెద్దపెల్లి డబుల్ రోడ్డు మార్గంలో ఇదే గ్రామానికి చెందిన సాతూరి సందీప్ (32) అనే యువకుడు సోమవారం రాత్రి పెద్దపల్లి నుండి కొలనూర్ లోని ఇంటికి బయల్దేరాడు.

బైకు పై వస్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లగా, సందీప్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ కోసం వెళ్లిన గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతుడు సందీప్ పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply