తాగునీటికే తొలి ప్రాధాన్యం : జిల్లా కలెక్టర్ ఆనంద్

  • నింబగల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
  • తుంగభద్ర నుంచి వచ్చే నీటిని పూర్తిగా తాగునీటికే వినియోగించాలని నిర్ణయం
  • వ్యవసాయానికి నీటి సరఫరా సాధ్యం కాదని స్పష్టం
  • రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు సాగు చేయాలని సూచన
  • బహువార్షిక పంటలకు మైక్రో ఇరిగేషన్ వినియోగించాలని విజ్ఞప్తి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలో రాబోయే సీజన్ లో తాగునీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నింబగల్లు గ్రామం వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ​ త్రాగునీటికి సంబంధించి జిల్లాలో రాబోయే సీజన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి, ఒకసారి తనిఖీ చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మేజర్ గా ఆర్.డబ్ల్యు.ఎస్ కి సంబంధించి కొన్ని ఉన్నాయని, అదేకాకుండా సత్యసాయి వాటర్ సప్లై బోర్డువి కూడా ఉన్నాయని, వీటన్నింటికి కూడా నీళ్లు హెచ్.ఎల్.సి కెనాల్ నుంచి డ్రా చేయడం జరుగుతాయన్నారు. రాబోయే నెలలో మనకు తుంగభద్ర నుంచి రిలీజ్ ఉండటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఆ నీటిని 100 శాతం డ్రింకింగ్ వాటర్ కి వాడుకుంటామని అనుకున్నామని, దానికి సంబంధించిన తగు చర్యలు తీసుకున్నామన్నారు.

ఆయా శాఖలకు కూడా దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈసారి ఎటువంటి పరిస్థితిలో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడానికి వీలవ్వదని, ఈ సీజన్ లో వర్షాభావంతో రెగ్యులర్ గా మన దగ్గర డ్రింకింగ్ వాటర్ కోసం ఉన్న ట్యాంక్స్ లో ఉన్న నీళ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయని, రైతులందరూ కూడా దీనిని సహకరించాలని కోరుతున్నామన్నారు. మొదటి ప్రాధాన్యత త్రాగునీటికే పెట్టుకుంటామన్నారు. తాగునీటికి పెట్టుకున్న తర్వాత ఏదైనా అవకాశం దొరికినట్లయితే, అప్పుడు ఖచ్చితంగా ఏదైనా సహాయం చేయగలుగుతాం కానీ, ప్రస్తుతానికి అయితే మాత్రం 100 శాతం తాగునీటికే ప్రాధాన్యత ఇస్తామని ప్రతి ఒక్కరికీ కూడా తెలియజేస్తున్నామన్నారు.

​అదేకాకుండా రైతులు వీలైనంత వరకు మీరు ఐడి క్రాప్ కి వెళ్ళండి.. ఐడి క్రాప్ కాకుండా, ఒకవేళ ప్రస్తుత బహువార్షిక పంటలు (ఎగ్జిస్టింగ్ పెరినియల్ క్రాప్స్) ఉన్నట్లయితే, ఖచ్చితంగా మైక్రో ఇరిగేషన్ ద్వారా చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, ఆర్ డబ్ల్యూ ఎస్ డి ఈ ఈ అంజుమన్ సఫ్రీన్, ఉరవకొండ తహసిల్దార్ అరుణ, ఆర్ డబ్ల్యు ఎస్ జేఈ ఐజయ్య, సైట్ ఇంజనీర్ ద్రాక్షాయిని, డిప్యూటీ ఎంపీడీవో మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.