Utkoor | అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు….

Utkoor | అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు….
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో అర్హులైన పేద వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంతోనే ఇంటింటా సౌభాగ్యం సాధ్యమని ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేస్తుందనిఅన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఊట్కూర్ మండల కేంద్రానికి మొదటి విడత 93 ఇండ్లు రెండో విడత 16 ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారని అన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని దశలవారీగా బిల్లులు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు పనులు వేగవంతంగా చేపట్టాలనిఅన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందనిఅన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణ పనులుపూర్తిచేస్తే మరో విడత పేదవారికి ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. గ్రామాల ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఏం. భరత్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, వార్డు సభ్యురాలు సందపురంసువర్ణ రవికుమార్, నాయకులుసమీ, బసిరెడ్డి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు..
