Accident | అదుపు తప్పిన లారీ..

Accident | అదుపు తప్పిన లారీ..
Accident | వికారాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : వికారాబాద్ బుగ్గ రామేశ్వరం వద్ద లారీ (HR.38 YO 333)అదుపు తప్పి అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న బైకుల పై దూసుకెళ్లింది. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపూర్ గ్రామానికి చెందిన లాలయ్య తన కుమారుడు హోండా యాక్టివా పై వికారాబాద్ స్కూల్ కు వస్తున్న సమయంలో ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లాలయ్య అనే వ్యక్తికి కాలు విరిగి తీవ్ర గాయాల కాగా కుమారుడు రిత్విక్ (6) స్పాట్లో మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
