2ndFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

2ndFebCartoon | జాతీయ, అంతర్జాతీయ సవాళ్ల నడుమ ప్రవేశపెట్టిన బడ్జెట్

2ndFebCartoon | జాతీయ, అంతర్జాతీయ సవాళ్ల నడుమ ప్రవేశపెట్టిన బడ్జెట్
బడ్జెట్‌పై మిశ్రమ స్పందనలు – మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు
బడ్జెట్ రోజున నిర్మలా సీతారామన్ ఆహార్యానికి ప్రాధాన్యం
ఆహార్యం–బడ్జెట్ అంశాల మధ్య నానార్థాలు
సరదాగా వాస్తవాన్ని చూపిన కార్టూన్

2ndFebCartoon
2ndFebCartoon

2ndFebCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షాల నుండి ప్రశంసలు, ప్రతిపక్షాల నుండి విమర్శలు..ఇవన్నీ మామూలే. అయితే ఈసారి బడ్జెట్ ఎప్పటి కంటే కాస భిన్నమైనది. ఎందుకంటే, జాతీయంగా, అంతర్జాతీయంగా ఇప్పుడున్న ఒత్తిళ్ళు, సవాళ్ళు, సమస్యలు, లక్ష్యాలు కాస్త జటిలమైనవే.

అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న బెదిరింపు ధోరణులు, క్లిష్టమైన విధానాలు, వాటినెదుర్కోవడానికి బలపడాల్సిన వ్యూహాలు, అలాగే జాతీయంగా మానవ వనరుల వినియోగం, ఏఐ విప్లవం…అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, హెచ్చుతగ్గులు ఇలా అనేక సవాళ్ళకు సమాధానమే ఈ బడ్జెట్…అందుకే ఈ సారి లక్ష్యాలు కొంచెం సుదీర్ఘంగా, సామాన్యులకందని ఆలోచనల్లాగా ఉన్నాయని పలువురి అభిప్రాయం.


వీటన్నిటినీ పక్కన పెడితే, ఆర్థికమంత్రి ఆహార్యం ప్రతి బడ్జెట్ రోజు హైలైట్. వారి ఆహార్యం, ఆరోజు ధరించే చీర, రంగు, బడ్జెట్ ప్రవేశపెట్టే బ్యాగ్ రంగు ఇవన్నీ ఆకర్షణీయంగా నిలుస్తుంటాయి. వాటిలో నానార్థాలు ఉన్నాయనీ, బడ్జెట్ లోని అంశాలకూ, వారి ఆహార్యానికీ మధ్య సామీప్యతలు, సారూప్యతలు ఉన్నాయని కథనాలు కూడా వస్తూంటాయి…

ఈ అంశాన్ని చమత్కారంగా ఆవిష్కరించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది. బడ్జెట్ పై విమర్శలూ ప్రశంసల జోలికెళ్ళకుండా సరదాగా అందించిన కార్టూన్. గత రెండు దశాబ్దాలుగా పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తున్న కార్టూన్ ఫీచర్ ఔరా.

click here to read more

click here to more oura cartoons

Leave a Reply