Karimabad | వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిరసన

Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను ఇంతజార్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమానికి చేరుకున్నారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ధర్నాకు ఎలాంటి అనుమతులు లేనందున ధర్నా విరమించాలని ఇంతజార్ గంజ్ సీఐ షూక్రు, మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ సూచించగా ధర్నా విరమించకపోవడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ను సీనియర్ నాయకులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మధ్యాహ్నం సొంత పూచికత్తు పై విడిచిపెట్టారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇది కక్ష సాధింపు చర్యగా ఆయన పేర్కొన్నారు.

Leave a Reply