9th Ward | బీఆర్ఎస్ జెండా ఎగరేవేస్తాం..

9th Ward | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం ఎన్నికల్లో 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అభ్యర్థి బండారి కవిత కృష్ణ భీమ వ్యక్తం చేశారు. ఈ రోజు తొమ్మిదవ వార్డు పరిధిలో ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి కవిత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో 9వ వార్డులో గెలవడం జరుగుతుందని, శ్రీనివాస కాలనీ ముంపు ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీనివాస కాలనీ ఇండ్లలోకి నీరు రాకుండా మత్తడి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అదేవిధంగా 9వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటర్లు బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని బీఆర్ఎస్ 9 వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
