Jangaon | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

Jangaon | జనగామ, ఆంధ్రప్రభ : కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం ఐపిఎస్ మీద చేసిన దుర్భాషలు ముస్లిం సమాజాన్ని కించపరిచినట్లేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ మమ్మద్ జమాల్ షరీఫ్ అన్నారు. ప్రజా ఆటంకం కలవకుండా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ ఐపిఎస్ ఆలంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దుర్భాషలాడడం సిగ్గుచేటని, వెంటనే ఇతనిపై చట్టరీత్య చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్న మాటలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి బాబా, మోయిన్ ,అన్సార్, అబ్దుల్ మన్నాన్ టిప్పు గౌస్, మియా బాయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply