Vijayawada | ఇంద్రకీలాద్రిపై వీణలతో లలితా సహస్రనామ గానం..

Vijayawada | ఇంద్రకీలాద్రిపై వీణలతో లలితా సహస్రనామ గానం..

  • రాజగోపురం ప్రాంగణంలో అలరించిన గానామృతం
  • భక్తిభావంతో 80 మంది కళాకారుల సంకీర్తన సేవ

Vijayawada | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపైని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన రాజగోపురం ప్రాంగణంలో ఆదివారం ఉదయం సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో వీణలతో లలితా సహస్రనామ గాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది వీణ కళాకారులు పాల్గొని లలితా సహస్రనామ స్తోత్రాన్ని సమూహ గానంగా ఆలపించారు. వీణల మధుర స్వరాలతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అమ్మవారి నామస్మరణతో భక్తులు తాదాత్మ్యంతో లీనమయ్యారు.

Vijayawada

ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు మాట్లాడుతూ ఇలాంటి భక్తి కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా, సంప్రదాయ కళలకు ప్రోత్సాహంగా నిలుస్తాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇంద్రకీలాద్రిపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న కళాకారులకు, భక్తులకు దేవస్థానం తరఫున శ్రీ అమ్మవారి దర్శనం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు విశేషంగా కృషి చేశారు.

Leave a Reply