టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం

పునర్నిర్మింప‌జేసిన ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్‌

పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గం కానూరులో టిడిపి జెండా దిమ్మను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. ఘటన స్థలానికి భారీగా టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆయన అనుచరులు చేరుకున్నారు. పరిస్థితుల నడుమ భారీగా పోలీసులు చేరుకున్నారు. ధ్వంసం చేసిన జెండా దిమ్మె స్థానంలో నూతన జెండాదిమ్మను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పునర్నిర్మించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ కుట్రపూరితంగా 1982వ సంవత్సరం నుంచి ఉన్న జెండాదిమ్మను వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి దేవ భక్తుని చక్రవర్తి తొలగించారన్నారు. చక్రవర్తి తాత దేవ భక్తుని వెంకటేశ్వరరావు అనధికారికంగా నిర్మించిన విగ్రహానికి ప్రహరీ నిర్మించే క్రమంలో జెండాదిమ్మెను చక్రవర్తి అనుచరులు తొలగించారన్నారు. శాసనసభ్యునికి ఫోన్ చేసి బెదిరించిన మాలపాటి భాస్కర్ రెడ్డిని సపోర్టు చేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం నియోజకవర్గం చూసిందన్నారు. కానూరు పరిధిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేసిన సైకో చక్రవర్తి అన్నారు.

జెండా దిమ్మెను ధ్వంసం చేసింది కాక ఎవరు వస్తారో రండి అంటూ ప్రగల్బాలు పలకడం ఎదుటివారిని రెచ్చగొట్టడం చక్రవర్తి నైజం అని గుర్తు చేశారన్నారీ. దేనికైనా ఓర్పు ఉంటుంది ఓర్పు నశిస్తే నేను చెప్పిన టిడిపి కార్యకర్తలు ఈసారి వినే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. ధ్వంసం చేసిన చోట దిమ్మెను పునర్నిర్మించామన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే గుడ్డలు ఉడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోడె ప్రసాద్ హెచ్చరించారు.