TG | నామినేషన్ల ప్రక్రియ పరిశీలన..!

TG | నామినేషన్ల ప్రక్రియ పరిశీలన..!
TG | మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని బుధవారం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు.. హెల్ప్‌డెస్క్‌ను సందర్శించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్ఓ కు అవసరమైన సూచనలు చేశారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు, డీఈ వెంకన్న, సీఐ లు నాగభూషణం, సోమ నరసయ్య, బాలు, గుడిపాటి కోటయ్య తదితరులు ఉన్నారు.
