TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TG | చెన్నూరు, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చెన్నూరు పట్టణ, గ్రామాలలో అధికారులు, విద్యార్థులు ఉపాధ్యాయులు ఆయా కార్యాలయాలలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. చెన్నూరు మున్సిఫ్ కోర్టులో జడ్జి పీ. రవి, పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ఓ బన్సీలాల్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మురళీ క్రిష్ణ, తహసీల్దార్ కార్యాల్యంలో తహసీల్దార్ మల్లికార్జున్ రావు, ప్రభుత్వ కళాశాల, పాఠశాలలో ఆయా ప్రధానోపాధ్యాయులు జెండా లు ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. మున్సిఫ్ కోర్టులో జాతీయ గీతం ఆలపించిన విద్యార్థులకు జడ్జి రవి కానుకలు అందజేశారు.

Leave a Reply