cheque | సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..

cheque | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న పేదవాడికి అండగా సీఎం సహాయనిధి పని చేస్తుందని ఊరుకొండ పేట కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మండల పరిధిలోని ఊరుకొండపేట గ్రామానికి నేహా కాటున్ భర్త అమీర్ కి రూ. 1,60,000 లబ్ధిదారునికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు శుక్రవారం లబ్ధిదారుని ఇంటి వద్ద అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఆపదలో సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, చాంద్ పాషా, మ్యకల శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, వహిదొద్దీన్, అంజయ్య గౌడ్, సాజిద్, మన్సూర్, రమేష్, రాజేష్, అక్బర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
