Nizampet | జాతరలో ఆటోలను జాగ్రత్తగా నడపాలి

Nizampet | జాతరలో ఆటోలను జాగ్రత్తగా నడపాలి
- ఎస్సై రాజేష్
Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : ఈ నెల 25 నుంచి చల్మేడలో జరగనున్న శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాల జాతరలో ఆటోలను జాగ్రత్తగా నడపాలని నిజాంపేట ఎస్సై రాజేష్ చల్మేడ ఆటో యూనియన్ సభ్యులకు సూచించారు. అనంతరం ఆటో యూనియన్ తరపున ఎస్సై రాజేష్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు పల్లె రవి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పల్లె ఎల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎరుకల భాస్కర్, కార్యదర్శి బి తిమ్మయ్య, సహా కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, మహేష్ గౌడ్, పాల్గొన్నారు.
