AP | అరకు కాఫీని ప్రోత్సహించాలి..

AP | అరకు కాఫీని ప్రోత్సహించాలి..
- నంద్యాల కలెక్టరేట్‌లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు
- ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, అరకు కాఫీని ప్రతీ ఒక్కరు ప్రోత్సహించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణంలో అరకు కాఫీ స్టాల్‌ను కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం నారా చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుందనిచ మొదటగా రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ అరకు కాఫీకి అలవాటు పడే విధంగా చూడాలన్నారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టిడిపి నాయకుడు ఎన్ ఎండి ఫయాజ్, డిఆర్ఓ రామునాయక్, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
