Drunk and drive | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష

Drunk and drive | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష

Drunk and drive | కమ్మర పల్లి, ఆంధ్రప్రభ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరు వ్యక్తులకు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి ఈ రోజు తెలిపారు. ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు కఠిన శిక్ష విధించినట్లు తెలిపారు.

కమ్మర్ పల్లి మండల పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అల్లం శ్రీనివాస్, పత్రి సుకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా కేసు వివరాలను పరిశీలించిన కోర్టు మెజిస్ట్రేట్ పసుపులేటి భవ్యశ్రీ నిందితులిద్దరికీ 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం కలగడమే కాకుండా, ఇలాంటి కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ అనిల్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply