TG | ఆంగ్ల ప్రతిభ పోటీల్లో మెండోరా విద్యార్థులు
TG | ఆంగ్ల ప్రతిభ పోటీల్లో మెండోరా విద్యార్థులు
TG | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని మెండోరా గ్రామ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఆంగ్ల ప్రతిభ పోటీలు (ఎల్టా) నిజామాబాద్ ఆధ్వర్యంలో మాణిక్ భవన్ పాఠశాలలో ఉపన్యాస విభాగంలో విజేత లైన అంగ ఆర్తి జెడ్పిహెచ్ఎస్ మెండోరా, ఒలింపియాడ్ సీనియర్ విజేత ఎండి. సోనా, జూనియర్ విభాగంలో ఏ శ్రేయస్ సాధించినందుకు ఈ రోజు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ లు కుంట లక్ష్మీ రమేష్ విజేతలను ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ విషయాన్ని మిగతా విద్యార్థులు కూడా స్పూర్తిగా తీసుకొని పోటీ పరీక్షలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు విజయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పల్లె శేఖర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
