మన ఆరోగ్యం మన చేతుల్లోనే..

మన ఆరోగ్యం మన చేతుల్లోనే..
జీవన శైలిలో మార్పు రావాలి
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గజిబిజి జీవితంలో ప్రస్తుతం జీవనశైలిలో మార్పును తీసుకువచ్చి మన ఆరోగ్యం కాపాడు కోవాలని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే జరుపు కుంటున్న సందర్భంగా డబ్ల్యూ హెచ్‌వో పిలుపునకు అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సి న అవసరం ఉందని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
సోమవారం విలేకరులతో మెడికవర్ వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలిలో మార్పుల వల్ల మధు మేహం, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతు న్నా యని పేర్కొన్నారు. సరైన ఆహారం, వ్యా యామం, మానసిక ప్రశాంతత ద్వారా అనే క వ్యాధులను నివారిం చవచ్చని వారు సూచిం చారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌కు చెంది న వైద్యులు ప్రజలకు కొరకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం లో డా. ఆనంద్ మాలు, జనరల్ ఫిజిషియన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. మధుమేహం, రక్త పోటు వంటి వ్యాధు లను నిర్లక్ష్యం చేయకుం డా, నిరంతర వైద్య పరీక్షలు చేయించు కోవాలని సూచించారు. అదేవిధంగా శరీరానికి తగినంత నీరు తీసుకో వడం, జంక్ ఫుడ్‌ను తగ్గించడం అవసర మని తెలిపారు.
డా. అంజలి, ఫిజిషియన్ మాట్లాడుతూమానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానం గా ముఖ్య మని పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయాలని సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్య లను కూడా నిర్లక్ష్యం చేయకూడదని, ము ఖ్యంగా మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఆరోగ్యం వ్యక్తిగతమై నదే కాకుండా సామాజిక బాధ్యత కూడా అని వైద్యులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య కరమైన జీవనశైలిని పాటిస్తేనే ఆరోగ్యవం తమైన సమాజం నిర్మాణం సాధ్యమవు తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్వామి, డియంఏస్ డా,, యజ్ఞ మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.
