MLA | ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

MLA | ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

  • అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్

MLA | మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు మోపిదేవిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు.

ఆయా శాఖల అధికారులకు ప్రజలు ఇచ్చిన అర్జీలను అందజేసి చాలా సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు తెలుసుకునేందుకు వారి సొంత మండలాల్లోనే ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎండిఓ స్వర్ణభారతి, తహసీల్దార్ హరనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply